Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్‌ను స‌మూలంగా తుడిచి వేయాలి: మంత్రి శ్రీధ‌ర్ బాబు

క‌లం వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో నేడు ఓర‌ల్ క్యాన్స‌ర్‌ (Oral Cancer )పై అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. గ్లోబ‌ల్ ఓర‌ల్ క్యాన్స‌ర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ.. న‌షా ముక్త్ తెలంగాణ కోసం ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. డ్ర‌గ్స్‌ను స‌మూలంగా తుడిచి వేసేలా ఈగ‌ల్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసుకున్నామ‌ని చెప్పారు.

ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తెలంగాణ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు మాట్లాడుతూ.. క్యాన్స‌ర్‌తో ఏటా 13 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని చెప్పారు. డ్ర‌గ్స్, గుట్కా, పాన్ మ‌సాలాల‌తో తీవ్ర ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గుట్కా, స్మోకింగ్ నిషేధించాల‌ని సూచించారు. అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత పెంచాల‌న్నారు. యువ‌త చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

Read Also: రిటైర్డ్ ఐఏఎస్ రజత్‌కుమార్‌ కు ఢిల్లీ హై కోర్ట్ షాక్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>