Delhi Blast | దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు 10 మంది మరణించారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎస్‌జేపీ ఆసుపత్రికి తరలించారు అధికారుల. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ బృందాలు రంగంలోకి దిగాయి.
ఎర్రకోట(Red Fort) మెట్రోస్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీస్ కమిషన్ వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు ఆయన తెలిపారు. ఎర్రకోట సమీపంలో ఉన్న సిగ్నల్ దగ్గర కారు నిమ్మదిగా ఆగిందని, ఇంకా పూర్తిగా ఆగకముందే ఒక్కసారి పేలిపోయిందని తెలిపారు. ఈ పేలుడులో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు.
పేలుడు(Delhi Blast)కు సంబంధించి సమాచారం అందిన వెంటనే.. అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఘటనకు సంబంధించి ఆరా తీశారు. మృతులకు తన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ఈ పేలుడు బాధ్యులను కనుగొనంపై హోంమంత్రి అమిత్ షా సహా ఇతర అధికారులు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు: అమిత్ షా
ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ‘‘పేలుడు సమాచారం అందిన పది నిమిషాల్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఫోరెన్సిక్, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.ఆ ప్రాంతంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశంచాం. ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడాను. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అతి త్వరలో ఈ ఘటనలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
వేగవంతమైన దర్యాప్తు జరపాలి: రాహుల్
‘‘పేలుడు ఘటన హృదయవిదారకమైంది. ఈ ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమగ్రమైన, వేగవంతమైన దర్యాప్తు చేయాలి. క్షతగాత్రులుత్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో హైఅలెర్ట్..
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరగడంతో హైదరాబాద్‌లో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఢిల్లీలో పేలుడు జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న మహానగరాలను అలెర్ట్ చేసింది. దీంతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, పూణే సహా పలు నగరాల్లో పోలీసులు అప్రమత్తయ్యారు. తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో పోలీసులు, ఇతర భద్రతా సి్బంది ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్ట్‌ల తరహాలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా సోదా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుడు దృష్ట్యా నగరంలో అలర్ట్ ప్రకటించామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
Read Also: మా డీప్‌ఫేక్‌లూ ఉన్నాయ్: సీజేఐ
Follow Us on: Instagram

