epaper
Tuesday, November 18, 2025
epaper

మా డీప్‌ఫేక్‌లూ ఉన్నాయ్: సీజేఐ

డీప్‌ఫక్‌(Deepfake)లకు తాము బాధితులమేనని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(CJI BR Gavai) చెప్పారు. డీప్‌ఫేక్ ద్వారా తయారు చేసిన తమ ఫొటోలు, వీడియోలనూ తాను చూశానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సాంకేతిక యుగంలో డీప్‌ఫేక్‌ అనేది అతిపెద్ద సమస్యగా ఉందని, దానిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్, చాట్‌బాట్ ఫిషింగ్ వంటి టూల్స్, యాప్స్‌ను వినియోగించి సైబర్ నేరగాళ్లూ సులభంగా మోసాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇది తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. ఏఐ దుర్వినియోగ ప్రభావం భారతదేశ న్యాయవ్యవస్థపై కూడా పెరుగుతోందని ఆయన అన్నారు. ఎందరో న్యాయమూర్తులు, న్యాయవాదుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారని, అవి తమ దృష్టికీ వచ్చాయని ఆయన వెల్లడించారు. ఏఐ దుర్వినియోగం పెరుగుతున్న క్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘‘సాధారణ ఏఐకి జెన్ ఏఐకి చాలా తేడా ఉంది. జెన్ ఏఐ అనేది న్యాయవ్యవస్థలోకి వస్తే అది ఉనికిలో లేని చట్టాలను సైతం రూపొందిస్తుంది. దాని వల్ల న్యాయవ్యవస్థలో అస్పష్టత నెలకొంటుంది. న్యాయ సంస్థలతో జెనరేటివ్ ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి మార్గదర్శకాలు రూపొందించేలా సుప్రీంకోర్టు(Supreme Court) మార్గదర్శకాలు ఇవ్వాలి’’ అని న్యాయవాది కార్తికేయ రావల్ కోరారు. ఈ అంశంపై విచారణ జరిపిన సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో తమ డీప్‌ఫేక్ ఫొటోలను చూసినప్పుడు తానూ ఖంగుతిన్నానని చెప్పారు. అనంతరం ఈ కేసుపై విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Read Also: భారత్‌‌లో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు పాక్ కుట్ర?

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>