పెద్దపల్లి జిల్లా డి-83 కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముత్తారం(Mutharam) గ్రామ శివారులోని డి-83 (D-83 Canal) కాల్వలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం (Dead Body) బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాల్వ నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ(Mortuary) కి తరలించారు. మృతుడు నలుపు రంగు రౌండ్ నెక్ టీషర్ట్ ధరించి ఉండగా, కుడి చేతికి గోల్డ్ రంగు బ్రాస్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే పెద్దపల్లి రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 8712656507, 8712659486

Read Also: హెల్తీ తిరామిసు: స్పెషల్ వీగన్ డెజర్ట్ రెసిపీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>