కలం, వెబ్ డెస్క్ : స్వీట్ అంటే ఇష్టమే కానీ.. క్యాలరీల భయంతో ఆగిపోతున్నారా? తీపి తింటే ఫిట్‌నెస్ పాడవుతుందని రాజీ పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే ‘హెల్తీ తిరామిసు'(Tiramisu). ఇదొక ఇటాలియన్ డెజర్ట్. సాధారణంగా ఇటాలియన్ డెజర్ట్ అంటే మైదా, చీజ్, పంచదారల కలయిక. కానీ, నటి వందన పండిట్ నిడదవోలు ఇప్పుడు ఆ డెజర్ట్‌కు ఒక హెల్తీ ‘రాగి’ కలిపి ట్విస్ట్ ఇచ్చారు. వినడానికి కొత్తగా ఉన్నా, రుచిలో ఇది అసలైన తిరామిసుకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. దీనికోసం రాగి బిస్కెట్లు, కాజూ క్రీమ్, కాఫీ డికాక్షన్, కోకో పౌడర్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా పదార్థాల తయారీకి కావాల్సిన పదార్థాలను ఓ సారి చూద్దాం..
రాగి బిస్కెట్ల తయారీకి కావలసిన పదార్థాలు :
బాగా పండిన అరటిపండు: 1
రాగి పిండి: ½ కప్పు
బేకింగ్ పౌడర్: ¼ చెంచా
నీరు: తగినంత (పిండి కన్సిస్టెన్సీ కోసం)
కాజూ క్రీమ్ కోసం:
జీడిపప్పు: ½ కప్పు (వేడి నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టినవి)
తేనె లేదా మేపుల్ సిరప్: 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: ½ టేబుల్ స్పూన్
వెనిల్లా ఎసెన్స్: ½ చెంచా
ఉప్పు: చిటికెడు
అసెంబ్లింగ్ కోసం:
కాఫీ డికాక్షన్ (లేదా ఎస్ప్రెసో): ½ కప్పు
కోకో పౌడర్: గార్నిష్ కోసం
ఈ రెసిపీలో మైదాకు బదులుగా కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండే రాగి పిండిని వాడతారు. పంచదార బదులు అరటిపండు, తేనెను ఉపయోగిస్తారు. ఇవి సహజమైన తీపిని అందిస్తాయి. మామూలుగా వాడే హెవీ క్రీమ్ స్థానంలో జీడిపప్పుతో చేసిన రిచ్ క్రీమ్ వాడటం వల్ల శరీరానికి మేలు చేసే కొవ్వులు అందుతాయి. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి కూడా ఇది ఒక వరప్రసాదమే. ముందుగా పండిన అరటిపండుతో రాగి పిండిని కలిపి ఓవెన్‌లో బేక్ చేస్తే క్రిస్పీ రాగి బిస్కెట్లు తయారవుతాయి. మరోవైపు నానబెట్టిన జీడిపప్పులను మిక్సీ పట్టి వెనిల్లా ఎసెన్స్ కలిపితే స్మూత్ అండ్ సిల్కీ వీగన్ క్రీమ్ రెడీ అవుతుంది. ఈ రెండింటినీ కాఫీ డికాక్షన్‌తో కలిపి లేయర్లుగా అమర్చి, చివరగా కోకో పౌడర్ చల్లితే.. తిరామిసు సిద్ధం. వడ్డించే ముందు గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచితే.. ఈ వీగన్ డెజర్ట్ ఇచ్చే కిక్కే వేరు. ఈ వీకెండ్‌లో మీరు కూడా ఈ క్లీన్ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేసి చూడండి.

