Mobile Popup Ad
Mobile Popup Ad

భర్తను హత్య చేసిన భార్య.. వివాహేతర సంబంధమే కారణం

కలం, బీబీనగర్: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ మండలం నెమరగొండల గ్రామంలో దారుణ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక రాంబాబు డైరీ ఫామ్‌లో పనిచేస్తున్న శౌరి బాబు (సూరి బాబు) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపత్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన శౌరి బాబు, అతడి భార్య మౌనిక రెండు నెలల కిందట రాంబాబు డైరీ ఫామ్‌లో పనికి చేరారు. వీరితో పాటు మరికొన్ని కుటుంబాలు కూడా అక్కడే పనిచేస్తున్నాయి. పెళ్లికి ముందు నుంచే ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో శౌరి బాబును అతడి భార్య మౌనిక, చిలక మరియదాసు, కుంతర్ల మరియదాసు, మౌనిక బాబాయ్ కలిసి దారుణంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని డైరీ ఫామ్ ప్రాంగణంలోని గడ్డి కుప్ప కింద పూడ్చి వేశారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని..

శౌరి బాబును హత్య చేసిన తర్వాత నిందితులు మౌనికను పక్కనే మరో రూమ్ తీసుకుని ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను తీవ్రంగా భయపెట్టారని మౌనిక పేర్కొంది. ఇటీవల ఆమె తన తల్లి ఇంటికి వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో శౌరి బాబు సోదరుడు మల్లేష్ ఇచ్చిన సమాచారంతో తొలుత ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసును బీబీనగర్ పోలీసులకు బదిలీ చేశారు. నిందితులు మృతదేహాన్ని గడ్డి ఉన్న ప్రాంతంలో పాతిపెట్టామని చెప్పడంతో పోలీసులు జేసీబీ సహాయంతో ఉదయం నుంచి తవ్వకాలు జరిపారు. అయితే, నిందితులు చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడం.. మృతదేహాన్ని వేరే ప్రాంతానికి మార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బీబీనగర్ పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>