ఏపీతో మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం మొదలైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండనుందని, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను దగ్గరకు వచ్చే వరకు వర్షాల ప్రభావం మరింత పెరిగుతుందని ఆయన చెప్పారు. గడిచిన 6 గంటల్లో గంటలకు 18 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలిందని, ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో మొంథా తుఫాను కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
ఈ తుఫాను(Cyclone Montha) పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని, కానీ అశ్రద్ధగా ఉండటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

