వికారాబాద్ జిల్లా తాండూరు(Tandur) మండల కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఘోరం జరిగింది. డెలివరీ కోసం వచ్చిన కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే మహిళ మృతి చెందింది. వైద్యం వికటించే రజిత మరణించిందని ఆరోపణలు వస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు గంటలకే రజిత తీవ్ర అస్వస్థతకు గురై మరణించిందని, ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆసుపత్రి దగ్గర వారు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో మాతా శిశు ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also: మద్యం దుకాణాలకు నేడే డ్రా.. ఎలా చేస్తారు..!

