ప్రధాని మోదీ పిలుపు.. ఎలక్ట్రిక్ వాహనంలో ఎమ్మెల్యే దన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Surya Narayana) ఆదివారం ఈవీ – ఎలెక్ట్రిక్ వెహికల్ లో ప్రయాణించారు. నగరంలోని పలు కార్యక్రమాలకు ఈవీ కారులోనే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

భారతదేశం 85 శాతం పెట్రోల్ డీజిల్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. అందుకోసం ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రధాని మోదీ (PM Modi) బంగారం, పెట్రోల్, డీజిల్, వంట నూనె తదితర వాటిని ఆదా చేయాలని పిలుపునిచ్చారని ఆయన (MLA Dhanpal) పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తాను ఎలక్ట్రిక్ వాహనంలో కార్యక్రమాలకు హాజరు అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ప్రధాని మోదీ పిలుపును పాటిస్తూ ముందుకెళ్లాలని కోరారు.

Read Also: ‘టెర్మినాలియా టోమెంటోసా’.. దాహాన్ని తీర్చే అద్భుత వృక్షం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>