కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వైరాలో రోడ్డు ప్రమాదం (Wyra Road Accident) జరిగిన స్థలాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) సందర్శించారు. శనివారం ఉదయం వైరాలోని రిలయన్స్ ట్రెండ్ వద్ద ఆర్టీసీ బస్సును, లారీ కంటైనర్ ఢీ కొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డ విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వైరాలోని ప్రమాద ప్రదేశాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సైన్ బోర్డు, స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, స్లిప్ రోడ్డును తక్షణమే సరి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి జాగ్రత్తగా వాహనం నడపాలన్నారు.
వాహనదారులు క్షేమంగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన’అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్ పై దృష్టి పెట్టి, వాహనంతో రోడ్డెక్కుతున్న తమ కుటుంబసభ్యులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఖమ్మంలో, వివిధ పోలీస్ స్టేషన్లు ఇతర శాఖలతో కలిసి ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం, గుంతలను పూడ్చడం, చెత్తా చెదారాన్ని తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ (CP Sunil Dutt) తెలియజేశారు.
Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!
Follow Us On: Sharechat

