కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) చట్టబద్ధతపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో మంత్రి లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను గుర్తు చేస్తూ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తాను కూడా హైదరాబాద్‌లోనే పుట్టానని, తనకు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసునని అన్నారు. హైదరాబాద్ అంటే అందరికీ ఎంతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలుగు వాళ్లు అందరూ చెమటోడ్చి కష్టపడ్డారని తెలిపారు. నాడు చంద్రబాబు సీఎంగా ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు.
సీఎంగా చంద్రబాబు (Chandrababu) తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు తాను ఎనిమిదో తరగతిలో ఉన్నానని, నాడు విజన్ 2020 అంటే అందరూ ఎగతాళి చేశారని చెప్పారు. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే విజన్ 2020 మనం సాధించుకున్నామని, హైదరాబాద్‌ను అద్భుతంగా నిర్మించుకున్నామని, ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసునని వ్యాఖ్యానించారు. నాడు మెజార్టీ సభ్యులు, ప్రజలు రాష్ట్రాన్ని విభజించొద్దని కోరినట్లు తెలిపారు. అయినా కూడా పార్లమెంట్‌లో టీవీలు కట్టివేసి, చర్చ లేకుండా హైదరాబాద్‌ను విభజించారన్నారు. ఇప్పుటికీ ఆ బాధ అందరిలో ఉందన్నారు. ఏపీ ప్రజల అవసరాలు తెలుసుకోకుండా, చర్చ జరపకుండా విభజన చేశారన్నారు. ఒక రాష్ట్రానికి రాజధాని, అసెంబ్లీ, సచివాలయం అన్నీ ఉన్నాయని, ఇంకో రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదన్నారు. ఈ రోజు కూడా విభజన బిల్లు కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు లోకేష్ (Nara Lokesh).
Read Also: మందుబాబులకు సమ్మర్ షాక్.. లిక్కర్, బీర్ ధరలు హైక్ !
Follow Us On : WhatsApp

