పెట్టుబడుల విషయంలో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) సూచించారు. అధిక రిటర్న్స్ ఆశచూపి సైబర్ నేరగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఆదివారం సిటీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న సజ్జనార్.. యువతకు కీలక సూచనలు చేశారు. ప్రతి రోజూ నగరంలో రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాటిలో పెట్టుబడుల పేరిట జరుగుతున్నాయని కూడా అధికంగానే ఉన్నాయన్నారు.
చాలా యాప్‌లలో పెట్టుబడుల పేరుతోనే మోసాలు జరుగుతున్నాయని, అధిక రిటర్న్స్ అనగానే యువత ముందూ వెనక ఆలోచించకుండా డబ్బులు పెట్టేస్తోందని, అలా కాకుండా జాగ్రత్త వహించాలని ఆయన చెప్పారు. పెట్టుబడులు పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఫోన్‌కు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయొద్దని చెప్పారు. వాటి వల్ల కూడా సైబర్ నేరాల ముప్పు ఉందని సూచించారు. ఒకవేళ సైబర్ నేరాల్లో డబ్బును కోల్పోతే వెంటనే 1930 నవంబర్‌కు ఫిర్యాదు చేయాలని CP Sajjanar తెలిపారు.
Read Also: కేసీఆర్ పథకాలను నేను ఆపలే: రేవంత్
Follow Us on: Youtube

