మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అనేక సమస్యలను చెప్తున్న కేటీఆర్.. గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావ్ అంటూ రేవంత్ ప్రశ్నించారు. ‘‘ఇక్కడ చెత్త ఉంది, అక్కడ మురికి ఉంది అని కేటీఆర్(KTR) అంటున్నారు. గత ప్రభుత్వంలో నువ్వేగా మున్సిపల్ మంత్రివి. రాష్ట్రంలో, కేంద్రంలో అన్ని మంత్రి పదవులు మీ తోడు దొంగలవే కదా. మా ప్రాతినిధ్యం లేని చోట సమస్యకు మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా?’’ అని రేవంత్ అన్నారు. ‘‘పైశాచిక ఆనందం, వికృత చేష్ఠలతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కళ్లల్లో విషం పెట్టుకుని మాడి మసై పోయేలా కేటీఆర్, హరీష్ రావు చూస్తుంటారు. ఇదేమైనా మీ తాత ముత్తాతల జాగీరా..?’’ అని ప్రశ్నించారు.
Read Also: గ్రామీణ ప్లేయర్లకు హెచ్‌సీఏ అన్యాయం.. ధ్వజమెత్తిన బండి
Follow Us on: Youtube

