epaper
Tuesday, November 18, 2025
epaper

కేసీఆర్ పథకాలను నేను ఆపలే: రేవంత్

మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రారంభించిన పథకాలను రేవంత్ రెడ్డి(Revanth Reddy) అటకెక్కించారని వస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ తీవ్రంగా ఖండించారు. తాను ఒక్క పథకాన్ని కూడా ఆపలేదన్నారు. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్ పలు విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలలో ఒక్కదానిని కూడా తాను ఆపలేదని, కోటి మంది మహిళలకు రెండు చొప్పున్న బతుకమ్మ చీరలు ఇచ్చామని స్పష్టం చేశారు. దోపిడీ చేస్తూ నాశిరకం చీరలను ఆనాటి ప్రభుత్వం ఇస్తే.. తమ ప్రభుత్వం మాత్రం ప్రతి మహిళకు రెండు మంచి చీరలను అందించాలని నిర్ణయించుకుందని, అందే విధంగా పథకాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు.

Jubilee Hills లో ఓటు అది చూసే వేయండి..

ఈ సందర్భంగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైన కూడా రేవంత్ స్పందించారు. ప్రజలంతా అభివృద్ధికి ఓటు వేయాలని అన్నారు. 2004-2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, 2014-2023 మధ్య ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని కొలబద్దగా తీసుకుని ఓటర్లు ఓటు వేయాలన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని విశ్లేషించండి, మమ్మల్ని ప్రశ్నించండి.. ఆ తర్వాతే ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని రేవంత్(Revanth Reddy) పేర్కొన్నారు.

Read Also: ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు : చంద్రబాబు

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>