తెలంగాణ రాజకీయాల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అంశం అత్యంత కీలకంగా మారుతోంది. తాజాగా గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి మహానందకుమారి(Mahananda Kumari) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఎప్పుడు చనిపోయాడు తల్లి అయిన తనకే సరిా తెలియదన్నారు. ‘‘కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాకే మాగంటి గోపీనాథ్ చనిపోయాడని ప్రకటన చేశారు. తల్లిగా నా కొడుకును ఎందుకు చూడనీయలేదు?’’ అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా గోపీ అంత్యక్రియలు అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ‘‘3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏమిటి? గోపీనాథ్ ను చివరి చూపు చూసుకునే అవకాశం మా వాళ్లకు ఇవ్వలేదు. డయాలసీస్ పేషెంట్ అయిన గోపీనాథ్ దగ్గర ఒక్క అటెండర్ ను కూడా పెట్టకుండా ఎందుకు వదిలేశారు?’’ అని అడిగారు.
‘‘నాకు జరిగిన అన్యాయం చెప్పుకుందామని కేటీఆర్(KTR) వెంట పరిగెత్తినా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. మనిషికి ఐడెంటిటీ ఉండాలి కదా. అందుకే నా మనవడి ఐడెంటిటీ కోసం పోరాడుతున్నా. గోపీనాథ్(Maganti Gopinath) కు సునీతకు వివాహం జరగలేదు. జూన్ 8న గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్ చేసిన తర్వాత జులై 4న సునీత లీగల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అందులో తన ముగ్గురు బిడ్డల పేర్లు తప్ప మా పేర్లు లేవు. నేను రెపో మాపో చనిపోతాను.. నా మనవడి కోసమే పోరాటం చేస్తున్నాను’’ అని చెప్పారామే.
Read Also: పెట్టుబడుల పేరుతో మోసపోవద్దు.. యువతకు సజ్జనార్ సజెషన్
Follow Us on : Pinterest

