Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి : నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, కౌన్సిలర్‌లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని లయన్స్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య (CP Sai Chaitanya) ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ప్రమాదాలకు గురికాకుండా సామాజిక బాధ్యతగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు.

ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు (Traffic Rules) పాటించాలని సూచించారు. యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరూ వారిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని సీపీ (CP Sai Chaitanya) కోరారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆరోగ్యంపై శ్రద్ధ, ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో రోడ్డు ప్రమాదాల నివారణ, యువతకు డ్రగ్స్ మీద అవగాహన కలుగుతుందన్నారు. 2020లో కరోనా ఫేస్ 1, ఫేస్ 2 లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని.. అదే 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 చనిపోయారని, జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య కు గురయ్యారని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధన తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్, బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, ఎన్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబశివరావు, ఎన్‌ఎస్‌ఈ మెంబర్స్ దుష్యంత్, కొడాలి కిషోర్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ , బోధన్ టౌన్ ఎస్ఐ మనోజ్, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునీల్, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Read Also: ఏపీ టూరిజంపై నీతి ఆయోగ్ నివేదిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>