కలం, క్రైమ్ బ్యూరో: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బండి భగీరథ్ (Bandi Bhagirath)కు సంబంధించిన కస్టడీ పిటిషన్ విచారణను మల్కాజ్‌గిరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు మే 26వ తేదీకి వాయిదా వేసింది. బండి భగీరథ్‌ను లోతుగా విచారించేందుకు 7 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది.ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు మే 26 వాయిదా వేసింది. తమ కుమార్తెను భగీరథ్ బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డడంటూ ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భగిరథ్ వేదింపులు భరించలేక తమ కుమార్తె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని వారు ఆరోపించారు.అయితే బాలిక మైనర్ (17ఏళ్లు) కావడంతో పోలీసులు బండి భగిరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మే 16న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం బండి భగీరథ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు.
మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే బండి భగీరథ్ (Bandi Bhagirath) స్నేహితులను పోలీసులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు.భగీరథ్, బాధితురాలి మధ్య ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెరిగినందున, వారి సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్‌లను విశ్లేషిస్తున్నారు. మరోవైపు పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తనపై పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని బండి భగీరథ్ కోర్టును ఆశ్రయించారు. గురువారం పిటిషన్ పై విచారణ జరిగింది. ముందస్తు బెయిల్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
Read Also: రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

