Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు యాదగిరిగుట్టలో పర్యటించబోతున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టరులో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేద పాఠశాలకు చేరుకుని.. కొత్త భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 గంటలకు స్వామి వారి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. అనంతరం, ఆలయంలో జరుగుతున్న పనులు, పెండింగ్ నిర్మాణాలపై ఉన్నతాధికారులతో కలిసి కీలక సమీక్ష చేస్తారు. తిరిగి ఉదయం 11.15 గంటలకు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్త చేస్తారు. మూడు గంటల పాటు పుణ్యక్షేత్రంలో ఉండబోతున్న ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>