భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కార్యాలయాన్ని అక్రమస్థలంలో నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. బీఆర్‌ఎస్ నేతలు ఈ దాడిని ఖండిస్తూ, ఇది రాజకీయ వైషమ్యంతో చేసిన దాడి అని ఆరోపిస్తున్నారు.
అక్రమనిర్మాణమేనా?
మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయాల కోసం వాడుకోవడం తగదని వారు మండిపడ్డారు. ఈ ఘటనతో మణుగూరు(Manuguru) పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు ఇరు వర్గాల నేతలను శాంతి భద్రతలు పాటించాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలమైతే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని.. అంతేకాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చతెస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: కేకే సర్వే ఫలితాలు విడుదల.. ఆధిక్యం ఆ పార్టీదే..
Follow Us On : Instagram

