జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికకు సంబంధించి కేకే సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 55.2 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని, కాంగ్రెస్ 37.8 శాతం, బీజేపీ 7 శాతం ఓట్లు పొందవచ్చని కేకే సర్వే అంచనా వేసింది.
కేకే సర్వే ప్రకారం డివిజన్ వారీగా ఫలితాలు
బోరబండ: బీఆర్ఎస్: 63.2%, కాంగ్రెస్ – 31.6%, బీజేపీ – 5.2%
రహ్మత్ నగర్: బీఆర్ఎస్ – 45.6%, కాంగ్రెస్ – 51.1%, బీజేపీ – 3.3%
శ్రీనగర్ కాలనీ: బీఆర్ఎస్ – 61.9%, కాంగ్రెస్ – 33.3%, బీజేపీ – 4.8%
వెంగళరావు నగర్ బీఆర్ఎస్ – 46.1%, కాంగ్రెస్ – 48.5%, బీజేపీ – 5.5%
ఎర్రగడ్డ బీఆర్ఎస్ – 61.6%, కాంగ్రెస్ – 31.7%, బీజేపీ – 6.7%
షేక్‌పేట్ బీఆర్ఎస్ – 60.1%, కాంగ్రెస్ – 33%, బీజేపీ – 6.9%
యూసఫ్‌గూడా బీఆర్ఎస్ – 47.1%, కాంగ్రెస్ – 45.5%, బీజేపీ – 7.4%
సర్వే వివరాల ప్రకారం జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, షేక్‌పేట్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం గట్టిగా ఉండగా, రహ్మత్ నగర్, వెంగళరావు నగర్ డివిజన్లలో కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు స్పష్టమైంది. యూసఫ్‌గూడలో మాత్రం ఉత్కంఠభరిత పోటీ నెలకొన్నట్లు సర్వే సూచించింది.
కేకే సర్వే(KK Survey) విశ్వసనీయత ఎంత?
కేకే సర్వే సంస్థ తెలంగాణలో చురుకుగా పనిచేస్తూ పలు ఎన్నికలపై సర్వేలు చేస్తోంది. అయితే ఈ సంస్థ సర్వే విధానం, నమూనా పరిమాణం వంటి వివరాలు స్పష్టంగా ప్రకటించకపోవడంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ గతంలో ఈ సర్వే గతంలో ఇచ్చిన ఫలితాలు ఎక్కువ సార్లు నిజమయ్యాయి. దీంతో ఈ సర్వేపై కాస్త విశ్వసనీయత ఉంది. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఈ సంస్థ చేసిన సర్వే ఫలితాలు కొంతవరకు నిజానికి చాలా ఉన్నాయి.
Read Also: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి
Follow Us On : Instagram

