epaper
Tuesday, November 18, 2025
epaper

పెద్దిలో జాన్వీ పాత్ర ఇదే.. !

బుచ్చిబాబు సానా, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది(Peddi) సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ లుక్స్ అందరినీ అలరించాయి. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) పాత్ర ఎలా ఉండబోతున్నది అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. తాజాగా ఆ వార్తను కూడా చిత్ర యూనిట్ చెప్పేసింది. జాన్వీ ఈ సినిమాలో ‘అచ్చియమ్మ’ పాత్రలో నటించబోతున్నది. ఇక తన గురువు సుకుమార్ బాటలోనే బుచ్చిబాబు కూడా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో సుకుమార్ హీరోయిన్ల పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే తరహాలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ దేనికీ భయపడని, తన ఆలోచనలకోసం ఎదురెదురుగా నిలబడే ఆత్మవిశ్వాసం గల యువతిగా కనిపిస్తోంది. ఆ పాత్రలోని ఆగ్రహం, స్త్రీ స్వాభిమానం, గ్రామీణ వాతావరణం కలబోతగా ఆ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

‘ఉప్పెన’తో తన ప్రత్యేకమైన నారేషన్‌ స్టైల్‌ చూపించిన బుచ్చిబాబు(Buchibabu), ఈసారి ‘పెద్ది’ ద్వారా మరింత భిన్నమైన కథను అందించనున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో క్రీడా అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌(Ram Charan) కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చరణ్‌–బుచ్చిబాబు కాంబినేషన్‌కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఏఆర్‌ రెహమాన్‌ చేరడం ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ నెల 8న రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనున్న రెహమాన్‌ లైవ్‌ కాన్సర్ట్‌లోనే ‘పెద్ది’ తొలి గీతాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) కెరీర్‌లో ఇది అత్యంత బలమైన పాత్రగా నిలవబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Read Also: నాణ్యమైన నిద్ర అంటే గంటల తరబడి పడుకోవడం కాదు..!

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>