కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరికంటే ముందే సభలోకి వచ్చిన కేసీఆర్ .. కొద్దిసేపటికే రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలుకరించడం.. ఆయనకు కరచాలనం చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే కేసీఆర్ (KCR) అసెంబ్లీకి వస్తున్నాడని బీఆర్ఎస్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. అసలు కేసీఆర్ ఈ సెషన్ మొత్తం ఉంటారా? లేదా? అన్న విషయం మీద క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన అసలు సభకు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్లిపోయారు? అని వారు ప్రశ్నిస్తున్నారు.
కేవలం అనర్హత వేటు తప్పించుకొనేందుకే హాజరు వేయించుకొని వెళ్లిపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఈ సెషన్ మొత్తం సభకు రావాలని.. ప్రజా సమస్యల మీద చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ నిజంగానే సభకు వస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.
Read Also: కుక్కలు బాబోయ్.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్
Follow Us On: Instagram


