రైతులకు మద్ధతు ఇవ్వడంలో బీజేపీ విఫలమైంది: రాంబాబు

కలం, రఘునాథపల్లి: దేవాదుల సృష్టికర్త, స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే కడియం శ్రీహరిని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని జనగామ (Jangaon) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్ చంద్ర రెడ్డి హెచ్చరించారు. శనివారం రఘునాథపల్లి (Raghunathapalli) మండల కేంద్రంలోని మారుజోడు రాంబాబు ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నా కూడా రైతులకు మద్దతు ప్రకటించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ మేకల నరేందర్ వరలక్ష్మి, జిల్లా నాయకులు గాదే మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కడారి రవి, సర్పంచులు, ప్రజాప్రతితులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించరా?: రాహుల్ గాంధీ

Read Also: స్మార్ట్ ప్రెసిడెంట్స్​!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>