కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ. 20 వేలుగా నిర్ణయిస్తూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెదక్ (Medak) పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ (Medak) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందుగుల గంగాధర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉందని, వేతనాలు పెంచిన సీఎం రేవంత్ రెడ్డికి కార్మికలోకం రుణపడి ఉంటుందని అన్నారు.
Read Also: తాటి కల్లు మేళా రద్దు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

