వదిలేసిన పిల్లల కోసం ఊయల: కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

కలం, వరంగల్ బ్యూరో: వదిలేసిన శిశువుల సంరక్షణ కోసం ఊయల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Chahat Bajpai) తెలిపారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అడాప్షన్ డ్రైవ్స్ ఫాస్టర్ కేర్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అడాప్షన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ఊయల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. పిల్లలను సాకలేని పరిస్థితుల్లో, ఆడపిల్ల వద్దని పుట్టగానే చెత్త కుప్పల్లో, ముండ్ల పొదల్లో, మురికి కాలువలలో వదిలివేయకుండా వారిని సంరక్షించుటకు వీలుగా ఊయల కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు.

మాతృత్వానికి మరో మార్గం చట్టబద్ధమైన దత్తత

మాతృత్వానికి మరో మార్గం చట్టబద్ధమైన దత్తత అని, చట్టబద్ద దత్తత దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా www.missionvatsalya.wcd.gov. in లో నమోదు చేసుకోవాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ మాట్లాడుతూ.. 2007 నుండి ఇప్పటివరకు 236 మంది పిల్లలను చట్ట బద్ధమైన దత్తత ద్వారా ఇచ్చామని, ఇందులో 11 మంది పిల్లలను విదేశీ దత్తత ఇచ్చామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దత్తత ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నేటి నుండి శ్రీకారం చుట్టామని అన్నారు. కాగా కలెక్టరేట్ లో దత్తత పొందగోరు తల్లితండ్రులకు, హనుమకొండ బస్టాండ్, కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు చట్ట బద్ధమైన దత్తతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, డీఎం అండ్ హెచ్వో డాక్టర్ అప్పయ్య, సిడిపివో స్వరూప, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇంచార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, శిశు గృహ మేనేజర్ మాధవి,చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక, హబ్ కో ఆర్డినేటర్ డి కళ్యాణి, చైల్డ్ హెల్ప్ లైన్ జయవర్ధన్, మరియు సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>