తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. హీరోయిన్ బేబీ బంప్ ఫోటో వైరల్!

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ గత ఏడాది నటి సిరి లెల్లాను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30వ తేదీన హైదరాబాద్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సిరి లెల్లా ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సిరి లెల్లా బేబీ బంప్ తో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి త్వరలోనే నారా రోహిత్ తండ్రి కాబోతున్నాడని అంటూ పలువురు నెట్టింట కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. అయితే దీనిపై నారా రోహిత్, సిరి లెల్లా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా, నారా రోహిత్, సిరి లెల్లా ప్రతినిధి 2 లో జంటగా నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం పెద్ధల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ కలిసి సుందరకాండ సినిమాలో నటించారు. ప్రస్తుతం నారా రోహిత్ విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఆదర్శ కుటుంబం మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>