ఎన్టీఆర్ వెన్నుపోటు ఘట్టంలో తుమ్మల కీలకం

కలం, ఖమ్మం బ్యూరో: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘట్టంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్ర కీలకమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) ఆరోపించారు. తుమ్మల పచ్చి అవకాశవాది అని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకొచ్చే తుమ్మ మొద్దు లాంటివాడు తుమ్మల అంటూ వ్యాఖ్యానించారు. తుమ్మ మొద్దు కష్టపడకుండా వరదలకు కొట్టుకొస్తుందో, అచ్చం అలాగే మంత్రి తుమ్మల కూడా… ఏ కష్టం పడకుండా అధికారం ఎటు ఉంటే అటు వెళ్లి మంత్రి పదవులు అనుభవిస్తున్నాడన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం నుండి చంద్రబాబు తెలుగుదేశం నుండి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికలకు ఒక నెల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వరకూ, పార్టీలు మారుస్తూ పదవులు అనుభవిస్తున్నాడనీ ఎద్దేవా చేశారు. అలాంటి తుమ్మలకు హరీశ్ రావును విమర్శించే స్థాయి లేదన్నారు.

Read Also: 25 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై.. ట్యాక్సీ డ్రైవర్​గా మారిన MBA గ్రాడ్యుయేట్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>