25 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై.. ట్యాక్సీ డ్రైవర్​గా మారిన MBA గ్రాడ్యుయేట్!

కలం, వెబ్ డెస్క్: ఎంబీఏ (MBA) పూర్తిచేసిన ఓ యువకుడు ఏడాదికి రూ.25 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. అయితే ఉద్యోగంలో వచ్చే ఒత్తిడి, పని గంటలు మానసిక ప్రశాంతతకు దూరం చేశాయి. దీంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన ఆత్మసంతృప్తి కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఓలా క్యాబ్ డ్రైవర్‌గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌‌కు (West Bengal) చెందిన సత్యాజిత్ బోస్ క్యాబ్ నడపడం ప్రారంభించినప్పుడు చుట్టుపక్కలవారు, బంధువులు విమర్శించారు. ‘చదువు వృథా చేసుకున్నావు.. పెద్ద ఉద్యోగం వదిలి డ్రైవర్‌గా మారవ్” అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలకు కుంగిపోలేదు. డ్రైవర్‌గా పనిచేస్తూనే రవాణా రంగంలోని మెళకువలను, వ్యాపార అవకాశాలను అర్థం చేసుకున్నాడు.

మూడేళ్ల నిరంతర కృషి తర్వాత అతడు కేవలం డ్రైవర్‌గానే మిగిలిపోలేదు. తన అనుభవంతో ఏకంగా 12 కార్లను కొనుగోలు చేసి ఒక ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ను సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రస్తుతం అన్ని ఖర్చులు పోను నెలకు రూ. 6.5 లక్షల నికర లాభాన్ని ఆర్జిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే ఏ వృత్తిలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని అతడు నిరూపించాడు.

Read Also: జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌కు‌ ప్రయోజనం ఎంత?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>