షాకింగ్.. గుడ్డు పెట్టిన కోడిపుంజు

కలం, వెబ్ డెస్క్: శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేట గ్రామంలో అరుదైన ఘటన వెలుగుచూసింది. సాధారణంగా కోడిపెట్టలు గుడ్లు పెట్టడం సహజం, కానీ ఓ కోడిపుంజు గుడ్డు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి ఓ కోడిపుంజు (Cock) పెంచుకుంటున్నాడు. ఈ పుంజు గుడ్డును పెట్టడంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు షాక్ అయ్యారు. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పారు. ఈ వార్త వైరల్ కావడంతో ‘కోడిపుంజు గుడ్డు పెట్టడం ఏంటి? అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: కాంగ్రెస్ పాలనలోనే రూపాయికి కిలో బియ్యం: రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>