తెలంగాణలో వ్యాట్ తగ్గించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్

కలం, నిజామాబాద్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా.. దేశ ప్రజలకు మరువలేని తీపి కబురు అందించారని, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 తగ్గిస్తూ..  ప్రజలపై ప్రత్యేక ప్రేమను చూపారని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ (Dinesh Patel Kulachari) గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, సామాన్య ప్రజలపై భారం పడకూడదని కేంద్రం పెద్ద సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.13 నుండి రూ.3కి తగ్గగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం మోదీ ప్రభుత్వ జనరంజక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ భారీ వెసులుబాటు వల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసరాలు అదుపులోకి వచ్చి, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని వివరించారు. కేంద్రం తన వంతుగా రూ.10 తగ్గించి బాధ్యత చాటిన వేళ, తెలంగాణలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

2014లో తెలంగాణలో వ్యాట్ (VAT) 28–30% ఉండగా, నేటి పరిస్థితిలో అది 35%కి చేరి దేశంలో అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని విమర్శించారు. కేంద్రం పదే పదే పన్నులు తగ్గించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించకపోవడం ప్రజల రక్తాన్ని పిండటమే అని ధ్వజమెత్తారు. పెట్రోల్ ధరలో రాష్ట్ర ప్రభుత్వ భాగం కేంద్రం కంటే ఎక్కువగా ఉండటం సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధరను రూ.100 లోపునకు తక్షణమే తీసుకురావాలని ఆయన (Dinesh Patel Kulachari) డిమాండ్ చేశారు.

Read Also: మా తుజే సలాం.. కొడుకు జ్ఞాపకార్థంగా సైనికుల కోసం షూ ప్యాడ్లు కుడుతున్న తల్లి

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>