కాంగ్రెస్ పాలనలోనే రూపాయికి కిలో బియ్యం: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: రూపాయికి కిలో బియ్యం పథకం కాంగ్రెస్ పాలనలోనే తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. అయితే అప్పట్లో ఈ పథకం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేదని.. ఎన్టీఆర్ ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారని.. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దళారుల దోపిడీ

రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా దళారులు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్య చేయడం కంటే పెద్ద నేరమని పేర్కొన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నా ప్రజలు ఆ బియ్యం తిన లేదని గుర్తు చేశారు. అందుకే తాము సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించామని గుర్తు చేశారు. దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్ననియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని పేర్కొన్నారు. ‘3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్‌లో ఇది 90 శాతం కూడా కావచ్చు’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం

తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని గుర్తు చేశారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చామని గుర్తు చేశారు. రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. తాము రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని గుర్తు చేశారు. పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని పేర్కొన్నారు.

ఆహారకల్తీ అరికట్టేందుకు హైడ్రా లాంటి వ్యవస్థ

రైతులు కేవలం వరి పంటనే నమ్ముకోకుండా ఇతర పంటలు కూడా సాగుచేయాలని గుర్తు చేశారు. పంట మార్పిడి విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. తమ తర్వాతి లక్ష్యం విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాణిజ్యపంటలు కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ‘పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈగల్, హైడ్రా లాగే ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక వ్యవస్థను తీసుకువస్తాం. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.

Read Also: సన్న బియ్యం పథకానికి ఏడాది.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ లంచ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>