బాంకీపూర్ ఎమ్మెల్యే పదవికి నితిన్ నబిన్ రాజీనామా!

కలం, వెబ్ డెస్క్ : బీహార్ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) తన బాంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆయన బీహార్ నుండి రాజ్యసభ సభ్యుడిగా (MP) ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని నితిన్ నబిన్ (Nitin Nabin) స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఎమ్మెల్యే పదవికి దూరమవుతున్నప్పటికీ, తన నియోజకవర్గ అభివృద్ధికి, బీహార్ రాష్ట్ర ప్రగతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తన మద్దతుదారులకు, ప్రజలకు హామీ ఇచ్చారు. ఉన్నత సభలో అడుగుపెడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత శక్తివంతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

Read Also: ఇరాన్ – ఇజ్రాయెల్​ యుద్ధం.. తెలంగాణ అసెంబ్లీలో కీలక తీర్మానం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>