Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగాల్ సీఎం దూకుడు.. సరిహద్దుల్లో కంచె ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి (CM Suvendu Adhikari) బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కంచె వేసేందుకు BSFకు భూమి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. 45 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఎంతో కాలంగా పెండింగులో ఉంటూ వస్తున్న ఈ కీలకమైన పనికి ఎట్టకేలకు ముందడుగు పడింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సుమారు 4,096 కిలోమీటర్లు మేర సరిహద్దు ఉంది. దీనిలో ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే సుమారు 2,200 కిలోమీటర్లు ఉంది. మిగతా భాగం అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో ఉంది.

అక్రమ వలసలతో ఇబ్బందులు..

బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు ఇటీవల సంవత్సరాల్లో అధికమవుతున్నాయి. వీరంతా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, ఓటు హక్కు కూడా పొందుతున్నారు. ఇదే కాకుండా, పశువుల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, డ్రగ్స్ రవాణా, ఉగ్రవాదుల చొరబాట్లు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో, శాశ్వతంగా కంచె నిర్మించాలని బీఎస్ఎఫ్ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు సమర్పించగా.. తాజాగా ఆమోదం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>