Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. MMTS రైళ్ల రద్దు!

కలం, వెబ్‌డెస్క్: నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎంఎంటీఎస్ (MMTS) రైళ్ల సేవలకు అంతరాయం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు, నిర్వహణ కారణాల దృష్ట్యా హైదరాబాద్‌ (Hyderabad) లో నేడు, రేపు రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ప్రధానంగా లింగంపల్లి – ఫలక్‌నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, సికింద్రాబాద్ – లింగంపల్లి రూట్లలో నడిచే పలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులు గమనించి, తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>