కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి (Gnana Saraswati Devi) అమ్మవారిని సోమవారం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం చదవుల తల్లికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్‌రెడ్డి దంపతులు బాసరలో మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రసాద స్వీకరణ అనంతరం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ప్రారంభించారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునః నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. సీఎం ఆదేశాలతో ఆగమశాస్త్రానుసారం ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. బాసర పర్యటన ముగిసిన తర్వాత సీఎం (CM Revanth Reddy) ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయినందున పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి సభలో ప్రసంగించనున్నారు.
Read Also: ట్రంప్ తీరుపై ఆర్జీవీ విశ్లేషణ.. ఏఐ చెప్పిందే వింటున్నాడని కామెంట్స్!
Follow Us On: Facebook

