Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు ఊపిరితిత్తులు.. స‌జ్జ‌నార్ అల‌ర్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్ (Hyderabad) న‌గరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగిని కాపాడేందుకు న‌గ‌ర పోలీసులు మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. బెంగుళూరు (Bengaluru) నుండి విమానంలో వస్తున్న ఊపిరితిత్తులను వేగంగా గమ్యస్థానానికి చేర్చేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (Sajjanar) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఊపిరితిత్తుల‌ను TS09UD8472 నంబర్ గల అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నారు. అత్యవసర వైద్య సేవల దృష్ట్యా అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో వాహనదారులు పోలీసులకు సహకరించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడే యజ్ఞంలో భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read Also: ట్రంప్ తీరుపై ఆర్జీవీ విశ్లేష‌ణ‌.. ఏఐ చెప్పిందే వింటున్నాడ‌ని కామెంట్స్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>