ట్రంప్ తీరుపై ఆర్జీవీ విశ్లేష‌ణ‌.. ఏఐ చెప్పిందే వింటున్నాడ‌ని కామెంట్స్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న వ్యూహాలపై, ఆయన ఇరాన్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. ట్రంప్ నిర్ణయాలు మనుషుల సలహాల కంటే ఏఐ ఆధారంగా సాగుతున్నాయేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం విష‌యంలో వెంట‌వెంట‌నే ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఒకసారి యుద్ధం ముగిసిందని, మరోసారి స్వల్పకాలిక చర్య అని, ఆ వెంటనే ఇరాన్‌ను రాతి యుగంలోకి నెట్టేస్తానని చెప్తున్నారు. ఆ త‌ర్వాత వెంట‌నే మళ్లీ చర్చలకు సిద్ధమని అంటున్నారు. ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు అల్గారిథమ్ ఇచ్చే ఆప్షన్ల వల్లనే సాధ్యమని వర్మ అభిప్రాయపడ్డారు.

సాధారణంగా మేధావులు, సలహాదారులు ఇచ్చే సమాచారం మానవ వేగంతో అందుతుందని, కానీ ట్రంప్ శైలి దానికి భిన్నంగా ఉందని వర్మ పేర్కొన్నారు. యుద్ధ సమాచారం, మార్కెట్ ఒడిదుడుకులు, ప్రజల సెంటిమెంట్‌ను ఏఐ క్షణాల్లో విశ్లేషించి ఇచ్చే ఏం జరుగుతుంది అనే సినారియోలను ట్రంప్ వాడుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. ఒకవైపు తీవ్రమైన హెచ్చరికలు చేస్తూనే, మరోవైపు మార్కెట్ కుప్పకూలకుండా జాగ్రత్త పడటం వంటి చర్యలు ఒక ఏఐ కో పైలట్ ఇచ్చే ఫలితాల్లా కనిపిస్తున్నాయని, ఇది అస్తవ్యస్తమైన మానవ ఆలోచన కాదని, స్వల్పకాలిక విజయాల కోసం అల్గారిథమ్ చేస్తున్న ఆప్టిమైజేషన్ అని వర్మ వివ‌రించారు.

మరోవైపు, ట్రంప్ ఉపయోగిస్తున్న భాషపై కూడా వర్మ తీవ్రంగా స్పందించారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచి, వారు పెద్దయ్యాక హుందాగా ఉండాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనుకుంటార‌ని, కానీ ప్రపంచంలోనే అత్యున్నత పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడే బహిరంగంగా బూతులు ఉపయోగిస్తుంటే వారికి ఏమని సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హార్మూజ్‌ను వెంటనే తెరవండి అంటూ ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఉదహరిస్తూ, ఇలాంటి ప్రవర్తనను సమాజం ఎలా స్వీకరిస్తుందని వ‌ర్మ‌ (RGV) ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: బీహార్‌లో అవినీతి అధికారి.. ప‌ని మ‌నిషికే కాస్ట్లీ కారు, ఇల్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>