కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) తన రియల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్న విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పాడ్ కాస్ట్ లో కృతి సనన్ మాట్లాడుతూ.. ‘మిమి’ సినిమా షూటింగ్ సమయంలో తన అండాలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఎక్కడా ఈ విషయాన్నీ వెల్లడించని కృతి.. తొలిసారిగా తన అండాలను భద్రపరిచినట్లు వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది.
అయితే తన అండాలను ఫ్రీజ్ చేయడంపై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. మిమి మూవీలో అద్దె గర్భం (సరోగసి) పాత్ర కోసం ఎక్కువగా లావుగా కనిపించాలని.. బరువు పెరిగేందుకు హెవీ ఫుడ్ తీసుకునేదానినని తెలిపారు. ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వలన కడుపు ఉబ్బరంగా ఉండేదని.. శరీరంలో చాలా మార్పులు కూడా వచ్చేవని చెప్పారు. అతిగా ఫుడ్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఏదైనా సమస్య రాకుండా.. మాతృత్వాన్ని అనుభవించేందుకు ముందు జాగ్రత్తగా ఇలా చేశానని చెప్పుకొచ్చారు.
సినిమా షూటింగ్ సమయంలో ఉన్న ఓ వ్యక్తి ఎగ్ ఫ్రీజింగ్ సలహా ఇచ్చారని.. అందుకే తాను పలుమార్లు అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి సనన్ (Kriti Sanon) వెల్లడించారు. ‘ఈ పని చేయగలిగితే నీకు నువ్వు ఇచ్చుకునే అత్యుత్తమ గిఫ్ట్ ఇదే’ అని చెప్పారని.. ఆ మాటే తన మనసులో బలంగా నాటుకుపోయిందని వెల్లడించారు. అందుకే ముందు జాగ్రత్తగా అండాలను ఫ్రీజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తన వ్యక్తిగత నిర్ణయాన్ని అభిమానులతో పంచుకోవడంపై కృతి సనన్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు.
Read Also: కాఫీతో మైగ్రేన్ తగ్గుతుందా? పెరుగుతుందా? నిపుణులు చెప్పిన నిజాలు
Follow Us On : WhatsApp

