Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంద్ర‌కీలాద్రికి అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డంతో అమ‌రావ‌తి రైతులు (Amaravati Farmers) విజ‌య‌వాడ‌ (Vijayawada)లోని ఇంద్ర‌కీలాద్రికి పాద‌యాత్ర‌గా త‌ర‌లివెళ్లారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆల‌యంలో కనకదుర్గమ్మను ద‌ర్శించుకొని రైతులు, మ‌హిళ‌లు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మ‌హిళ‌లు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే కాలి నడకన కొండ‌కు వ‌స్తామ‌ని మొక్కుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల్లో అమ‌రావ‌తి బిల్లుకు ఆమోదం ల‌భించింద‌ని, అందుకే ఆల‌యానికి వ‌చ్చి మొక్కులు చెల్లించుకున్నామ‌ని చెప్పారు.

Read Also: ట్రంప్ తీరుపై ఆర్జీవీ విశ్లేష‌ణ‌.. ఏఐ చెప్పిందే వింటున్నాడ‌ని కామెంట్స్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>