Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంపై విచారణ చేపట్టాకే.. మాకు సూచనలు ఇవ్వాలి: CM రేవంత్

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్‌ చేయడంతో అధికార, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) సభ్యుల కౌంటర్లతో సభ దద్దరిల్లుతోంది. ఈ తరుణంలోనే బీజేపీ (BJP) సభ్యులు సైతం అధికార పక్షానికి సూచనలు ఇచ్చేందుకు మాట్లాడగా.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వారిని అడ్డుకున్నారు. బీజేపీ సభ్యులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్లు దోచుకుందని ప్రధాని మోడీ చెప్పారని.. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని మోడీ ప్రస్తావించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారని గుర్తు చేశారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని.. 48 గంటలు కాదు, ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారని చురకలు అంటించారు.

కిషన్ రెడ్డిని బీజేపీ సభ్యులు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ఆదేశాలు తీసుకొని రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీశ్ రావును జైల్లో పెట్టించిన తరువాతే తమకు సూచనలు చేయాలని చురకలు అంటించారు. నెలల తరబడి సీబీఐ విచారణ అని బీజేపీ నేతలు తొక్కిపట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో కలిసే పోటీ చేసి ఓట్లు, సీట్లు పంచుకున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. హరీశ్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హరీశ్ రావు నిజాయితీపరుడని కేటీఆర్, వెంకటరమణ రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు.

రాఘవ కన్​స్ట్రక్షన్​ వ్యవహారంపై మంత్రి పొంగులేటి (Minister Ponguleti)ని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. పోడియం వైపు వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూస్తామన్నారు. సర్కారు దిగిరాకపోతే గవర్నర్​ను కలిసి పొంగులేటిని బర్తరఫ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరతామని అన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సీబీసీఐడీ విచారణకు శనివారం సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారని తెలిపారు. బీఆర్ఎస్​ వద్ద ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వాలని సూచించారు.

Read Also: రేవంతూ.. పొంగులేటి దోపిడీలో ఎంతున్నది నీ వంతు?: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>