కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల (BRS Leaders) నిరసనలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేకపోవడం వల్ల అసలు మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందన్నారు. మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి గత పదేళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని చెప్పినట్లు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాలు మంచివైనా, చెడ్డవైనా… బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా ఉంటే న్యాయ విచారణకు వెళ్లవచ్చని సూచించారు. హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో సాధ్యం కాదని కూనంనేని (Kunamneni) చెప్పారు. గతంలో తాను బయ్యారం విషయంలో హౌస్ కమిటీ కోరినట్లు గుర్తు చేశారు. సభను ఆర్డర్‌లోకి తీసుకురావడం కోసం నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. సభలో గందరగోళంతో తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు.
Read Also: ధరణితో బీఆర్ఎస్ నేతల భూ దోపిడీ: కడియం శ్రీహరి
Follow Us On : WhatsApp

