కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డులో (RRR) యాభై శాతం నిధులు కేంద్రం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో తాను అడిగిన అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని తాము పరిగణనలోకి తీసుకోకతప్పదని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని చెప్పారు. మెదక్ సభలో ‘నిధులు వద్దు మీ ప్రేమ చాలు’ అని మోదీతో కేసీఆర్ అన్నాడని.. తాము అలా అనడం లేదని.. నిధులు అడిగామని చెప్పారు. మోదీ మాటలను ఎవరికి వారు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. తాను బీజేపీ పార్టీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయం పైన తాము చర్చించామని సీఎం వివరించారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని.. అది తన హక్కుఅని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. దీని గురించి ప్రధాని మోదీని (PM Modi) అడిగానని.. దానికే ప్రధాని సమాధానం చెప్పారన్నారు. 2034 వరకు రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దాలని అడిగానని.. దానికి మోదీ ఆమోదం తెలిపారని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని చెప్పారు. కేంద్రం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్, కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదని.. తాము వచ్చాక క్లియర్ చేయిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి వీటిని పరిష్కరించమని ప్రధానిని కోరామని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవని.. రాజకీయ అంశాలకు తావు లేదని చెప్పారు. మోదీ, తన మధ్య జరిగిన ప్రస్తావన రాష్ట్ర అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు.
బీజేపీ (BJP) రెండు సీట్లతో ప్రారంభమైందని.. మళ్ళీ అక్కడికే వస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రైవేట్ కార్యక్రమమని తెలిపారు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ అని.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతమని విమర్శించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, కులాలు, మావోయిస్టులు దేశ ప్రజలు కారా? అని ప్రశ్నించిన సీఎం.. అందరికి సమాన హక్కులున్నాయని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఖతం చేయడమే వాళ్ల పార్టీ విధానమని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఒప్పించి జనజీవనంలో కలపడం తమ విధానమని కొనియాడారు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ దని తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటు పై తాము ప్రత్యేక చొరవ తీసుకున్నామని చెప్పారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు ఏ సమస్యలపైన కొట్లాడారో వాటిపైన తాము చట్టాలు చేశామని చెప్పారు. సమస్యలు తగ్గిపోవడం వల్లనే నక్సలిజం తగ్గిపోతూ వచ్చిందన్నారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని తాము అన్నా,మని.. చివరకు మావోయిస్టులు తమ లైన్ కు వచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. మనషులను చంపడం పరిష్కారం కాదని.. మనుషుల ప్రాణాలకు ఉన్న విలువ తమకు తెలుసు అని చెప్పారు. మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములు అని సీఎం రేవంత్ (CM Revanth) వ్యాఖ్యానించారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదని అన్నారు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కాని విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం అని చెప్పారు. 818 మంది మావోయిస్టులు తెలంగాణలో సరెండర్ అయ్యారని.. దేశంలోనే ఎక్కడా ఇలా జరగలేదని చెప్పారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులకు తీసుకువచ్చినందుకు తెలంగాణను ప్రధాని అభినందించాలన్నారు. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలని.. ప్రభుత్వం నుంచి వైద్య సాయం, ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: బండి సంజయ్ సానుభూతి కోసం ప్రయత్నించొద్దు: మంత్రి పొన్నం
Follow Us On : WhatsApp

