కలం, వెబ్ డెస్క్: అమరావతి ముసుగులో భారీ అవినీతి జరుగుతోందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సూచించిన మావిగన్ సరైన పరిష్కారమని చెప్పుకొచ్చారు.
సీఆర్డీఏ నిబంధనలు పట్టించుకోరా?
రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే చట్టంలో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా అమలు చేయడంలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. అమరావతి (Amaravati) కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇవ్వాల్సిన విధానం ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియలో అనేక కొర్రీలు పెట్టారని ఆరోపించారు. రైతులు తమ భూమిని రాజధాని కోసం ఇచ్చిన తర్వాత, వారికి ఇచ్చే ఫ్లాట్లపై కూడా పరిమితులు విధించారని పేర్కొన్నారు. రైతులకు కేటాయించిన భూమిని తమ వారసులకు పంచుకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.
ఎప్పటికి పూర్తి చేస్తారు?
అమరావతి కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని పేర్ని నాని (Perni Nani) ప్రశ్నించారు. అమరావతి పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, లక్షల కోట్ల రూపాయల వ్యయం చేసినప్పటికీ స్పష్టమైన ఫలితాలు కనిపించడంలేదని ఆరోపించారు. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా, ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, దాని భవిష్యత్ ఏమిటో స్పష్టత లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
Read Also: నన్ను వైసీపీకి దూరం చేయడం ఎవరివల్ల కాదు: యాంకర్ శ్యామల
Follow Us On: X(Twitter)

