Mobile Popup Ad
Mobile Popup Ad

ఆలయంలో ప్రమాణం చేయ్.. బండి సంజయ్‌కు పొన్నం అనిల్ సవాల్!

కలం, కరీంనగర్ బ్యూరో: మహాశక్తి ఆలయంలోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) కు కరీంనగర్ (Karimnagar) జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ (Ponnam Anil Kumar Goud) సవాల్ విసిరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ధర్నా చేపట్టారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్‌ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కళ్ళు మూసుకొని ఉన్న ప్రధాని మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.

ఈ సందర్బంగా అనిల్ (Ponnam Anil) మాట్లాడుతూ.. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అని మండిపడ్డారు. అటు కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్‌ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్‌తో పాటు మీర్ షౌకత్ అలీ, నారదాసు వసంత రావు, బొంకూరి మోహన్, అన్వేష్, రవి నాయక్, సైఫ్, నయీం, సతీష్, దినేష్, రవి గౌడ్, గొడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్, రుద్ర రాధ, అజంతా, హిమబిందు, శ్రీలత, రాజమణి, రేణుక, అరుణ పలువురు బీఆరఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>