కలం, వెబ్ డెస్క్ : మేడారం మహాజాతర 2026లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జాతరకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్ లో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. మేడారం జాతరను వచ్చే జనవరి 28 నుంచి 31 దాకా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఆ పనులకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Read Also: కిలాడీ లేడీలు.. మాయ చేసి 2 కిలోల వెండితో జంప్
Follow Us On: X(Twitter)


