కలం, వెబ్ డెస్క్ : బంగారం కొనేందుకు వచ్చిన కొంత మంది మహిళలు ఎవరి కంటా పడకుండా బంగారు గొలుసులు, కాళ్ల పట్టీలు నొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.. సీసీ కెమెరాలు ఉన్నా.. ఒక ప్లాన్ ప్రకారం వచ్చి.. షాపుల్లో సిబ్బందిని మాటల్లో పెట్టి బంగారాన్ని అపహరిస్తారు. ఇలాంటి ఘటన ములుగు(Mulugu) జిల్లాలో వెలుగుచూసింది. బంగారం కొనేందుకు వచ్చిన ఇద్దరు మహిళలు వెండీ పట్టీల బాక్సుతో ఉడాయించారు. అందులో రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు (Silver Theft) ఉన్నాయని షాపు నిర్వాహకులు చెబుతుఉన్నారు. షాపు సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం.. మొదట ఇద్దరు మహిళలు వచ్చి బంగారు ఆభరణలు ఖరీదు చేస్తున్నట్లు నటించారు.
ఆ తర్వాత మరో నలుగురు మహిళలు వచ్చి షాపులో వర్కర్లను కన్ఫ్యూజ్ చేశారు. పట్టీలు చూపించాలని తొందరపెట్టారు. పట్టీల ట్రే తీసి చూపిస్తున్న క్రమంలోనే ఆ మాయలేడీలు వాళ్ల పనికానిచ్చేశారు. బాక్స్ తగ్గడం చూసి అనుమానంతో సీసీ టీవీ చూడాగా.. చోరీ చేస్తున్న మహిళలను గుర్తించారు యాజమాని. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మాయ లేడీల కోసం గాలిస్తున్నారు.
Read Also: భారీ బస్సు ప్రమాదం.. ఒకరి మృతి.. 36 మందికి గాయాలు
Follow Us On: X(Twitter)


