కలం డెస్క్: రైల్వేశాఖ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్(Railway Charges) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన టికెట్ రేట్లు డిసెంబర్ 26 నుంచే అమల్లోకి రాబోతున్నాయని తెలిపింది. ప్రస్తుతం చేసిన మార్పుల్లో లోకల్, కొద్దిదూరం ప్రయాణాల్లో ఎలాంటి రేట్లు పెంచలేదు. అలాగే ఆర్డినరీ క్లాస్ లో 215 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణాల్లో కూడా టికెట్ ఛార్జీలు ఎప్పటి లాగానే ఉన్నాయి. కానీ 215 కి.మీ.కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే కిలోమీటర్ కు రూ.1పైసా చొప్పున పెంచింది. అలాగే ఎక్స్ ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్ కు రూ.2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది.
నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల దాకా ప్రయాణించేవాళ్లు రూ.10 ఎక్కువ చెల్లించాలి, ఈ పెరిగిన ధరలు(Railway Charges) మొత్తం మరో ఐదు రోజుల్లోనే అమల్లోకి రాబోతున్నాయి. వీటి ద్వారా మరో రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైళ్లలో మరింత సౌకర్యాలు పెంచుతామని రైల్వేశాఖ (Railway Department) గతంలోనే ప్రకటించింది.
Read Also: ప్రేమపేరుతో వల.. అమ్మాయిలతో డ్రగ్స్ దందా..
Follow Us On: Pinterest


