Mobile Popup Ad
Mobile Popup Ad

తుంగభద్ర జలాలపై కేంద్రానికి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్ : తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం తెలంగాణకు 15.9 టీఎంసీల తుంగభద్ర జలాలు రావాల్సి ఉందని… కానీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మిగిలిన నీటిని పొరుగు రాష్ట్రాలు వాడుకుంటుంటే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (cwc) సారథ్యంలో తుంగ భద్ర బోర్డ్ ను పటిష్టం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. నీటి పంపిణీ సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే 2004 నిపుణుల కమిటీ చేసిన సూచనలను వెంటనే అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరుఫున రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) కు రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆర్డీఎస్ పనులు పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఆర్డీఎస్‌ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని సీఎం చెప్పారు. ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర పేరుకుపోయిన పూడికను తక్షణమే తీయడానికి ఉమ్మడి చర్యలు చేపట్టాలని వెల్లడించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ 1,2 పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తుమిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>