నర్సంపేట మండలంలో తాటివనం దగ్ధం

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) మండలం లక్నపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు తాటివనానికి నిప్పంటించారు. పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. భారీగా తాటిచెట్లు దగ్ధం కావడంతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని గౌడ కులస్థులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరై ఉంటారా.. అనేది ఆరా తీస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>