ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: సాయిని మల్లేశం

కలం, కరీంనగర్ బ్యూరో : ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ కార్యక్రమాన్ని కరీంనగర్ (Karimnagar) జిల్లాలో విజయవంతం చేసేందుకు తగిన కృషి చేయాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. హర్ గర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాం పురస్కరించుకుని బిజెపి మండల, జోన్ అధ్యక్షులతో, పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం కరీంనగర్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ ప్రోగ్రామ్‌లు ఈ నెల 10 నుండి ప్రారంభం కానున్నాయన్నారు. మండల పార్టీల ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమాలను ‘తిరంగా యాత్ర’లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను కోరారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు మరియు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

అనంతరం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగాని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి,డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సీనియర్ నాయకులు, బాస సత్యనారాయణ రావు, కన్న బోయిన ఓదెలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, గుజ్జ శ్రీనివాస్ లతో పాటు జిల్లా ముఖ్యనేతలు, మండలాల, జోన్ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశాన్ని అనంతరం నూతన జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంను, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి లను బిజెపి శ్రేణులు ఈ సందర్భంగా సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>